Jyothika: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జ్యోతిక..!!

by Kodari Anjali |   (  Updated:2024-11-27 04:08:44  IST  )

టాలీవుడ్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Jyothika: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జ్యోతిక..!!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ జ్యోతిక(Jyothika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకుంది. షాక్(shock), చంద్రముఖి(Chandramukhi), ఠాగూర్(Tagore), వాలి(Vali), డుం డుం డుం(Dum dum dum), ఝాన్సీ(Jhansi), 36 వయసులో(36 Vayasulō), దొంగ(Doṅga), జాక్ పాట్(Jack pot), బంగారు తల్లి(Baṅgāru talli), రక్తసంబంధం(Raktasambandhaṁ), కథల్: ది కోర్(Kathal: The Core) వంటి సినిమాల్లో నటించింది. తోటి నటుడు సూర్య(Sūrya)ను వివాహమాడి.. సినీ ఇండస్ట్రీలోనే ఆదర్శ దంపతులుగా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. జ్యోతిక తిరుమల శ్రీవారి(tirumalasrivaru)ని దర్శించుకుంది. నేడు (బుధవారం) వీఐపీ(VIP) ప్రారంభ విరామ దర్శన సమయంలో ఈమె స్వామి వారి సేవల్లో పాల్గొంది. తితిదే ఆఫీసర్లు నటి జ్యోతికకు వెల్కమ్ చెప్పి.. దర్శన ఏర్పాట్లు చేశారు. ఈమె దర్శనం చేసుకున్నాక.. రంగనాయకుల మండపం(Ranganayaka Mandapam)లో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story
null