- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ పిరికి వాడంటూ హీరోయిన్ అనన్య పాండే షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా విజయ్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ.. నిజానికి తను చాలా భయస్తుడని, సినిమాల్లోనే అలా ధైర్యంగా కనిపిస్తాడని చెప్పుకొచ్చింది. సాధారణంగా విజయ్‌ను చూస్తే 'యాటిట్యూడ్ కా బాప్' అనేలా ఉంటాడు కానీ అదంతా సినిమాలకే పరిమితమని తెలిపింది. రియల్ లైఫ్‌లో పూర్తి భిన్నమైన మనస్తత్వమని చెప్పిన బ్యూటీ.. తనను 'బెస్ట్ కో స్టార్' గా ప్రశంసించింది.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్, అనన్య 'లైగర్' సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 'మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్' నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే విడుదలైన 'లైగర్' టీజర్ అభిమానులను ఉర్రూతలూగించగా.. ఆగస్టు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






