అమ్మాయి హత్య కేసులో స్టార్ నటులు.. ఎంక్వైరీ లో ఏం తేలింది?

by Disha Web Desk 17 |
అమ్మాయి హత్య కేసులో స్టార్ నటులు.. ఎంక్వైరీ లో ఏం తేలింది?
X

దిశ, సినిమా: విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జల్సా'. సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ రెండు నిమిషాల ట్రైలర్‌ ఒక యువతిని ఒక వ్యక్తి వెంబడించడంతో మొదలవగా.. చివరికి ఆ అమ్మాయి హత్య చేయబడుతుంది. ఈ మేరకు కేసు పరిశీలనలో భాగంగా విద్య, షఫాలీ పరిచయమవుతారు. ఓ ప్రముఖ వార్తా ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ పాత్రలో విద్యబాలన్, బాధితురాలి తల్లిగా షెఫాలీ కనిపించగా.. ట్రైలర్ అభిమానుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది. టీ- సిరీస్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. మార్చి 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రిమియర్‌ కానుంది. మానవ్ కౌల్, రోహిణి హట్టంగడి, ఇక్బాల్ ఖాన్, విధాత్రి బండి, శ్రీకాంత్ మోహన్, షఫీన్ పటేల్ సూర్య కాశీభట్ల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Next Story

Most Viewed