నటుడి బర్త్ డే స్పెషల్.. 'స్లమ్ డాగ్' మూవీ నుంచి పవర్ పోస్టర్ విడుదల..

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-20 13:45:34  IST  )

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh), విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'స్లమ్ డాగ్'(Slumdog).

నటుడి బర్త్ డే స్పెషల్.. స్లమ్ డాగ్ మూవీ నుంచి పవర్ పోస్టర్ విడుదల..
X

దిశ, సినిమా: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh), విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'స్లమ్ డాగ్'(Slumdog). ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈనేపథ్యంలో.. నేడు దునియా విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో ఆయన రఫ్‌ లుక్‌లో కనిపించారు. స్లీవ్‌లెస్ గ్రీన్ వెస్ట్, బోల్డ్ పెండెంట్, బ్రౌన్ హ్యాట్‌తో ఆయన స్టైలింగ్ అదిరిపోయింది.

ఎనర్జిటిక్ ఎక్స్‌ప్రెషన్, స్ట్రీట్-స్మార్ట్, పవర్‌ఫుల్ వైబ్‌ను ఇచ్చాయి. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్‌లు హ్యుమరస్ పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్, 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.

Next Story