దేవుడే నాతో అలా మాట్లాడించాడు.. మాజీ మిస్ యూనివర్స్

by Dishafeatures2 |
దేవుడే నాతో అలా మాట్లాడించాడు.. మాజీ మిస్ యూనివర్స్
X

దిశ, సినిమా: కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చిన మాజీ మిస్ యూనివర్స్, నటి సుస్మితాసేన్.. ఇటీవల వచ్చిన 'ఆర్య' వెబ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను తాజాగా ప్రేక్షకులతో పంచుకుంది. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నపుడు ఆఖరి రౌండ్‌లో జడ్జిలు మహిళల గురించి పలు ప్రశ్నలు అడిగారని చెప్పిన నటి.. 'ఈ సృష్టికి భగవంతుడిచ్చిన వరం స్త్రీ. ఈ రోజు ఆడపిల్లే లేకపోతే మనందరం ఇక్కడ కలిసేవాళ్లమే కాదు. అందుకే నేను మహిళగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను' అని సమాధానం చెప్పినట్లు తెలిపింది. అయితే అంతపెద్ద వేదికపై ఆ సమయంలో దేవుడే తనతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడించాడంటూ చెప్పిన సుస్మితా.. న్యాయనిర్ణేతలంతా తనపై పొగడ్తల వర్షం కురిపించారని గుర్తుచేసింది.




Next Story

Most Viewed