- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వద్దంటే వద్దు.. మీరు ఢిల్లీకి వెళ్లొద్దు".. నితీష్ నిర్ణయంపై జేడీయూ నేతల ఆందోళన
నితీష్ కుమార్ రాజ్యసభ నిర్ణయంపై జేడీయూ శ్రేణుల ఆగ్రహం. ఆయన నివాసం వద్ద భారీ నిరసన, సీఎం గానే కొనసాగాలని డిమాండ్.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో పలు రాజ్యసభ సభ్యుల పదవి కాలం ముగియనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) రాజ్యసభ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో సీఎం నితీష్ కుమార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, పాట్నాలోని ఆయన నివాసం వద్ద జేడీయూ (JDU) నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగానే కొనసాగాలని, ఆయన నాయకత్వం బీహార్ అభివృద్ధికి ఎంతో అవసరమని వారు నినాదాలు చేశారు. తన పార్లమెంటరీ కోరికను నెరవేర్చుకోవాలనే నితీష్ ప్రకటనపై పార్టీ శ్రేణులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నితీష్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున్న చేరుకున్న కార్యకర్తలు.. నిరసనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలు తమ ప్రియతమ నేతను కలిసి రాజ్యసభ నామినేషన్ వేయవద్దని విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నించారు. "నితీష్ కుమార్ బీహార్ ముఖచిత్రం, ఆయన లేని బీహార్‌ను ఊహించలేము" అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ తన నిర్ణయం పై పునరాలోచన చేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.






