ఇష్టానుసారంగా తెలంగాణలో అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవు : గుత్తా అమిత్​రెడ్డి

by Malleboina Mahesh |

విజయ డెయిరీ బ్రాండ్ పై ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చు. ఏపీ నెయ్యి కల్తీ అంటూ తెలంగాణ ఆరోపణ.. వ్యాపారం దెబ్బతీయడానికేనని ఏపీ కౌంటర్.

ఇష్టానుసారంగా తెలంగాణలో అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవు : గుత్తా అమిత్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : విజయ డైరీ బ్రాండ్ల వివాదం రెండు రాష్ట్రాల మధ్య ముదురుతోంది. కల్తీ నెయ్యి అమ్మకాలు, ప్రైవేటు సంస్ధకు పాల అమ్మకాలు బాధ్యతలు ఏపీ అప్పగించిందని తెలంగాణ డైరీ ఆరోపిస్తుంది. పూర్తిగా కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందని, ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి వెంటనే ఏపీ నేతలు కౌంటర్​ఇస్తూ తాము విజయ ఉత్పత్తుల విషయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని, ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తలు సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది.

తెలంగాణలో ఏపీ విజయ బ్రాండ్‌ ఉత్పత్తులు నాణ్యత దెబ్బతీస్తుందని,అక్కడి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని తెలంగాణ డెయిరీ డెవలప్​మెంట్ కార్పొరేషన్​చైర్మన్​గుత్తా అమిత్​రెడ్డి ఆరోపించారు. మేఘన ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీంతో తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు.

ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి పాల సేకరించి అమ్మకాలు చేయాలని, ప్రైవేటు సంస్దలకు పాల సేకరణ ఎందుకో అప్పగించింతో సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. ఏపీకి ఇక్కడ సహకార సంఘాలు లేవని, సరఫరా చేస్తున్న ఇస్తున్న నెయ్యి కల్తీగా ఉందని ఏపీ ఫెడరేషన్‌ ఫ్రాంచైజీ ఇస్తున్న నెయ్యిని పరీక్షలు చేయించామని అది పూర్తిగా కల్తీ ఉన్నట్ల ల్యాబ్​రిపోర్టు వచ్చిందన్నారు. గుజరాత్​లో తయారైన నెయ్యి హైదరాబాద్​లో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ డైరీ నాణ్యత కాపాడటం అందరి బాధ్యత అన్నారు. విజయ డైరీ పేరుతో ఎవరైనా తెలంగాణలో విక్రయాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. పాలను కొనుగోలు చేసేటప్పుడు తెలంగాణ లోగో చూడాలని, తక్కువ ధరకు వస్తుందని తీసుకుంటే ఆనారోగ్యం సమస్యలు వస్తాయని సూచించారు.

తమ వ్యాపారం దెబ్బతీయడానికే కల్తీ ఉందని విమర్శలు : రమణారెడ్డి

విజయ ఉత్పత్తుల విషయంలో తాము రాజీ పడకుండా నాణ్యమైనవి సరఫరా చేస్తున్నామని ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్​​చైర్మన్​రమణారెడ్డి తెలిపారు. విజయ డైరీ అనేది ఉమ్మడి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా విస్తరించిందని, తాము అప్పటి నుంచి పాలు అమ్మకాలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో నెయ్యి కల్తీపై శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపి నాణ్యత లేకుంటే సరఫరా నిలిపివేస్తామని ప్రకటించారు. కల్తీ చేయడం తమ ఉద్దేశం కాదని, వ్యాపారం పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణమన్నారు.

Next Story