నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు: ఏడీఏ కరుణశ్రీ

by Jakkula.Mamatha |

రైతులు లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు: ఏడీఏ కరుణశ్రీ
X

దిశ,కారేపల్లి: రైతులు లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు. గురువారం కారేపల్లి మండలంలోని పలు విత్తన దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం, సీతారాంపురం, అప్పాయిగూడెం, గ్రామాల్లో రైతులతో సమావేశమై వ్యవసాయ సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా వరి, మిరప వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.భూమిలో తగిన తేమ ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలని, అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న వారిపై వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, డీఏపీకి బదులుగా నానో డీఏపీ వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భట్టు అశోక్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓలు) బీ.నరేష్, ఎస్‌కే.మున్నీ, తదితరులు పాల్గొన్నారు.

Next Story