నిబంధనలు ఉల్లంఘించిన నర్సింగ్ స్కూల్స్ పై చర్యలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించిన నర్సింగ్ స్కూల్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.

నిబంధనలు ఉల్లంఘించిన నర్సింగ్ స్కూల్స్ పై చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న నర్సింగ్ స్కూల్స్ పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. సెప్టెంబర్ 2025లో అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన సుమారు 9 నర్సింగ్ స్కూల్స్ కు భారీ జరిమానా విధించారు.

ఒకచోట అనుమతి... మరోచోట నిర్వహణ...

అనుమతి పొందిన ప్రాంతంలో కాకుండా వేరొక చోట పాఠశాలలు నిర్వహించడం, ఒకే భవనంలో రెండు కంటే ఎక్కువ స్కూళ్లను నడపడం, సరైన మౌలిక సదుపాయాలు మరియు అధ్యాపకులు లేకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. దీనిపై మొత్తం 23 జిఎన్ఎమ్ నర్సింగ్ స్కూళ్లపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ఆధారాలతో సహా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం 40 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించి లోతైన విచారణ జరిపింది. నివేదికలో వెల్లడైన లోపాల ఆధారంగా, ఒక్కో పాఠశాలకు రూ. 5 లక్షల చొప్పున 9 పాఠశాలలకు మొత్తం రూ. 45 లక్షల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన నర్సింగ్ స్కూల్స్ పై చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story