ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్ : సీఐ ప్రసాద్

by Batti.Sumithra |

ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.

ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్ : సీఐ ప్రసాద్
X

దిశ, ఉట్నూర్ : ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉట్నూర్ ఎస్సై విజయ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉట్నూర్‌కు చెందిన నేతావత్ రాందాస్, నేతావత్ జైల్‌సింగ్ అనే ఇద్దరు నిందితులు ఈ నెల 26న ఉట్నూర్‌లోని ఓ హాస్టల్ వార్డెన్‌ వద్దకు వెళ్లి, ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ రూ.5 వేలివ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి పదేళ్లు జైలుకు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు.

గత ఆరు నెలల్లో ఇదే విధంగా రెండు సార్లు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.6 వేలును వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, దర్యాప్తులో నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు. ఇలా ఎవరైనా బెదిరింపులు, బలవంతపు వసూళ్లు (ఎక్స్‌టార్షన్) వంటి నేరాలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఎం. ప్రసాద్ హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా బెదిరింపులకు గురైనట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story