- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
హన్మకొండ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్ రెడ్డి నివాసాల్లో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

దిశ, వెబ్ డెస్క్/వరంగల్ బ్యూరో: హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ (Warangal Deputy Collector)గా విధులు నిర్వహిస్తున్న వెంకట్ రెడ్డి (Venkat Reddy) నివాసాల్లో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు (ACB officials) దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక ప్రైవేటు పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం రూ. 60,000 లంచం తీసుకుంటూ గత నెల మంగళవారం నాడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో, అధికారులు తదుపరి చర్యల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ లోని ఆయన ఇళ్లు, బంధువుల నివాసాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో డిప్యూటీ కలెక్టర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ సాంబయ్య తెలిపారు. కాగా ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.






