- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూగర్భ జల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు..
సూర్యాపేట జిల్లా భూగర్భ జల శాఖ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా భూగర్భ జల శాఖ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా భూగర్భ జల శాఖ అధికారి బాలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా ముందస్తు ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో నిఘా ఏర్పాటు చేసి అధికారి లంచం స్వీకరిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని, సంబంధిత పత్రాలను పరిశీలిస్తూ సోదాలు కొనసాగిస్తున్నారు. లంచం ఏ పని నిమిత్తం తీసుకున్నారు, ఎంత మొత్తం స్వీకరించారు, ఈ వ్యవహారంలో మరెవరైనా అధికారుల పాత్ర ఉందా అనే అంశాల పై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. కార్యాలయంలోని పలు రికార్డులు, ఫైళ్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా భూగర్భ జల శాఖ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏసీబీ అధికారులు సోదాలు పూర్తి చేసిన అనంతరం పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పై ఏసీబీ కఠిన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.






