- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ ఫోకస్‌తో రెవెన్యూలో దడ!
రంగారెడ్డి జిల్లాలోని ‘రెవెన్యూ’లో అవినీతి రా జ్యమేలుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలోని ‘రెవెన్యూ’లో అవినీతి రా జ్యమేలుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నప్పటికీ అవినీతి వ్యవహారం షరా మామూలే అన్నట్లుగా ఉంటోంద న్న విమర్శలు విన్పిస్తున్నాయి. లం చాల జాడ్యం కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని విభాగాల్లో నూ ఉంది. ముఖ్యంగా భూములకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనే అవి నీతి ఎక్కువగా ఉంటోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాజకీయ అండదండలతో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ఏళ్ల తరబడిగా అధికారులు, సిబ్బంది పాతుకుపోవడం తో అన్ని వ్యవహారాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. వేళ్లూనుకుపోయిన అవినీతిపై ఏసీబీకి సైతం ఫిర్యాదు లు వెళ్తున్నాయి. ఈ క్రమంలో తా జాగా.. శంషాబాద్ తహశీల్దార్ కా ర్యాలయంపై వచ్చిన ఫిర్యాదుల నేప థ్యంలో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా రికార్డుల తనిఖీలను జరుపుతోంది. కొన్ని అక్రమాలను సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వివిధ శాఖలపై పంజా విసురుతున్న ఏసీబీ తాజా గా.. ‘రెవెన్యూ శాఖ’పై ఫోకస్ చేసిం ది. దీంతో అవినీతి అధికారుల్లో ఏసీ బీ చర్యలు దడ పుట్టిస్తున్నాయి. ఏసీ బీ అడుగులు ‘నెక్ట్స్’ ఎటువైపు అన్నదానిపై సంబంధిత ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా.. సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప ‘రెవెన్యూ’లో అవినీతికి చెక్ పడ దన్న అభిప్రాయం విన్పిస్తోంది.
పైసా లేనిదే పనికాదు!
‘ధరణి’ పోయింది. ‘భూ భారతి’ వచ్చింది. కానీ..అవే సమస్యలు. రైతులకు అవే తిప్పలు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా దరఖాస్తుల పరిస్థితి ఉంది. ఏ పని కా వాలన్నా. పైరవీ కారులు చెప్పాలి. పైసా లేనిదే పని కాదు. చిన్నస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి అధికా రి వరకు అంతా వసూళ్లే. కొన్ని కా ర్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులదే పెత్త నం. కొన్ని చోట్ల ఆఫీసులోని సిబ్బం దే దళారులుగా వ్యవహరిస్తున్నారు. మామూళ్లు తీసుకుని పనులు చేసి పెడుతున్నారు. మ్యుటేషన్ మొదలుకుని నిషేధిత జాబితాలో ఉన్న భూ ముల వరకు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ల్యాండ్ కన్వర్షన్ వంటి వాటికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు చెల్లించినప్పటికీ అద నంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. పైసలిస్తే.. అసైన్డ్ భూ ములకు సైతం పట్టాలు ఇస్తున్నారన్న విమర్శలను రెవెన్యూ శాఖ మూ టగట్టుకుంటోంది.
లంచం ఇవ్వకపోతే..కొర్రీలు పెట్టి ఆపేస్తున్నారు. వారసత్వం, ఫౌతీ వాటికి కూడా ఇ బ్బందులకు గురి చేస్తున్నారని బాధి తులు ఆరోపిస్తున్నారు. తహశీల్దార్ నుంచి అడిషనల్ కలెక్టర్ వరకు ఏసీ బీకి పట్టుబడ్డ ఉదంతాలు జిల్లాలో ఉన్నాయి. లక్షల్లో జీతాలు తీసుకునే ఉన్నతాధికారులు ఇలా.. బరితెగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మొరపెట్టుకునేందుకు కలెక్టరేట్‌కు వస్తే.. ఇక్కడా అదే తంతు నడుస్తుందని బాధితులు వాపోతున్నారు. రికార్డు సెక్షన్లలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగులతోపాటు నాయిబ్ తహశీల్దార్, ఆర్‌ఐల ప్రక్షాళన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.






