- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇల్లే లక్ష్యంగా ఏసీబీ దాడులు
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఫోన్ ట్యాపింగ్ కేసు సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసాలు, బంధువుల ఇళ్లతో కలిపి సూర్యపేట సహా 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి భారీ సోదాలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి సస్పెన్షన్‌కు గురైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు (Additional SP Bhujanga Rao) ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. భుజంగరావు తన అధికార పరిధిని ఉపయోగించి భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారం, ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలకు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్‌తో పాటు సూర్యపేట జిల్లా సహా మొత్తం 15 విభిన్న ప్రాంతాల్లో ఈ తనిఖీలు ముమ్మరం గా కొనసాగుతున్నాయి. భుజంగరావు నివాసం తో పాటు ఆయనకు అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యులు మరియు బంధువులకు చెందిన ఇళ్లలో కూడా ఏసీబీ ప్రత్యేక బృందాలు ఉదయం నుంచే సోదాలు జరుపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా తోడవడంతో భుజంగరావు చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది. కాగా ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






