NLG: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 10:33:03  IST  )

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు.

NLG: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్
X

దిశ, గుర్రంపోడు: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మహ్మద్ హకీమ్(Revenue Inspector Mohammed Hakim) ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆన్‌లైన్‌లో భూమి వివరాలు అప్‌డేట్‌ కోసం లంచం డిమాండ్‌ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఇంకా ఎవరెవరు పట్టుబడ్డారు?, ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారు? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం కార్యాలయంలో విచారణ ప్రక్రియ కొనసాగుతుంది.

Next Story