మరోసారి అభిషేక్ విధ్వంసం.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

by Gantepaka Srikanth |

అస్సాంలోని గౌహతీ మైదానం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు.

మరోసారి అభిషేక్ విధ్వంసం.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాంలోని గౌహతీ మైదానం వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించారు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. మూడో టీ20లో న్యూజిలాండ్ భారత్ ముందు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్ 48, మార్క్ చాప్‌మన్ 32 పరుగులు చేశారు. భారత్ తరపున జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. ఒక బ్యాట్స్‌మన్ రనౌట్ అయ్యాడు. కివీస్ తరపున మాట్ హెన్రీ ఒక వికెట్, కైల్ జామిసన్ మూడు, రాచిన్ రవీంద్ర నాలుగు, డెవాన్ కాన్వే రెండు, టిమ్ సీఫెర్ట్ 12, మిచెల్ సాంట్నర్ 27, డారిల్ మిచెల్ 14 పరుగులు చేశారు. టీమిండియా విజయం సాధించాలంటే మరో 49 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story