- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్‌ఎస్‌లో చేరిన ఆరూరి రమేష్.. కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aaruri Ramesh) భారతీయ జనతా పార్టీకి (BJP) షాకిస్తూ ఇవాళ భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ మేరకు నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆరూరి రమేష్‌కు మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఎవరైనా పిల్లవాడు ఇల్లు తప్పిపోయి తిరిగి వస్తే తల్లిదండ్రులు ఎంత సంబరపడతారో.. ఇవాళ ఇక్కడున్న పెద్దలు కూడా నన్ను చూసి అంతే సంబరపడుతున్నారని కామెంట్ చేశారు. వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురదజల్లి, వారు రాజకీయంగా ఎదగకుండా చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయ్యి, వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమికి కడియం కారణమయ్యారని ఆరోపించారు. అటువంటి పరిస్థితుల వల్లే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కడియం శ్రీహరి లాంటి పాపాత్ముడు బయటకు వెళ్లిపోయాడు కాబట్టే, తిరిగి సొంత ఇంటికి రావాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు.






