తిండి కోసం 16 మందితో ఆ ప‌నిచేసిన అమ్మాయి!

by Disha Web Desk 20 |
తిండి కోసం 16 మందితో ఆ ప‌నిచేసిన అమ్మాయి!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః చాలా కొద్దిమంది మిన‌హాయించి, ఏ మ‌నిషైనా త‌న ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెడుతున్నారంటే దాని వెనుక ఒక విషాదం ఉండ‌క‌పోదు. ఇలాగే ఒక అమ్మాయి త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌, తిన‌డానికి తిండి లేక‌ డేటింగ్‌కి వెళితే అబ్బాయిలే బిల్లు చెల్లిస్తార‌ని, క‌డుపునిండా భోజ‌నం చేయొచ్చ‌ని పెద్ద సాహ‌స‌మే చేసింది. డేటింగ్ వెబ్‌సైట్‌ల‌కు వెళ్లి 16 రోజులు వరుసగా డిన్నర్ డేట్‌లకు వెళ్లింది మెకాల్ బ్రాక్ అనే యువ‌తి. ఈ విష‌యాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. "కాలేజీలో ఉండ‌గా తిండికి డబ్బు లేకపోవటంతో నేను డేటింగ్ యాప్‌కి వెళ్లి 16 రోజులు వరుసగా 16 డిన్నర్ డేట్‌లు తీసుకున్నాను.." అని ఆమె పేర్కొంది. అయితే, చాలా మంది ఆమె "హాక్"ని "మేధావి" అని అన్నారు. కొంద‌రైతే క‌డుపుకు అన్నం కోసం అమాయ‌కులైన వారిని మోసం చేశావంటూ నిందించారు. మ‌రి మీరేమంటారు..?



Next Story

Most Viewed