- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్ళిలో డీజే పాటల కోసం లొల్లి.. యువకుడి హత్య
గోరఖ్‌పుర్‌లో ఒక పెళ్లి వేడుకలో డీజే పాటల విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణం తీసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో ఒక పెళ్లి వేడుక రక్తసిక్తమైంది. డీజే పాటల విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణం తీసింది. షాహ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. గోరఖ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి కుమార్తె వివాహ వేడుక ఒక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ఏర్పాట్లు చేసాడు. అయితే పెళ్లి ఊరేగింపు సమయంలో డీజే పాటల విషయంలో వరుడి తరపు బంధువులకు, స్థానికులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత ఇదే గొడవ భోజనాల దగ్గర కూడా కంటిన్యూ అయ్యి, తమకు 'చికెన్ లెగ్ పీసులు' వడ్డించలేదని వరుడి బంధువులు వడ్డించే వారితో గొడవకు దిగారు. మద్యం మత్తులో ఉన్న ఇరువర్గాలు మాటామాటా పెంచుకోవడంతో వివాదం ముదిరింది. క్షణాల్లోనే ఒకరిపై ఒకరు రాళ్లతో కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగారు.
ఈ ఘర్షణలో స్థానిక షాహ్‌పుర్‌కు చెందిన సుమీత్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివాహ వేడుకలో తీసిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






