పది వేల కోసం పిలిపించి.. 14 కత్తిపోట్లు!

by Vinod kumar |   (  Updated:2022-03-08 12:12:26  IST  )

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో - A young man was attacked with a sword in Nizamabad district

పది వేల కోసం పిలిపించి.. 14 కత్తిపోట్లు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో పట్టపగలే తల్వార్ తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ యువకుడికి 14 కత్తిపోట్లు దిగిన ఘటన మంగళవారం మధ్యాహ్నం ఐదో టౌన్ పరిధిలోని శాంతి నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమీర్, అన్వర్ కి గతంలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అయితే కేసు విత్ డ్రా కోసం అన్వర్ కు రూ.30 వేలు ఇచ్చేందుకు అమీర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే రూ.20వేలు చెల్లించి.. రూ.10 వేలు చెల్లించే విషయం మాట్లాడేందుకు నిజామాబాద్ నగరంలోని శాంతి నగర్ కు పిలిపించారు. ఈ క్రమంలో పాత కక్షల నేపథ్యంలో అమీర్ అనే వ్యక్తి మరి కొంత మందితో కలిసి అన్వర్ పైన తల్వార్ తో దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్వర్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story