- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వార్టర్‌లో కారు బీభత్సం.. ధ్వంసమైన ద్విచక్ర వాహనం
by GSrikanth |
దిశ,గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది.

X
దిశ,గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ నగర్‌లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనంతో పాటు వాటర్ పైప్ లైన్‌లను సైతం ధ్వంసం చేసుకుంటూ మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. అదే కాలనీకి చెందిన సదరు యువకుడు ఇష్టానుసారం వాహనం నడిపి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఆ సమయంలో బయట పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఎప్పుడు సింగరేణి క్వార్టర్స్ ముందు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఈ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Next Story






