- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రకీలాద్రిపై మహిళల బాత్రూంలోకి చొరబడి వీడియోలు తీసిన యువకుడు!
ఇంద్రకీలాద్రి ఆలయంలో దారుణం! మహిళల బాత్రూంలోకి చొరబడి వీడియోలు తీసిన యువకుడు. పట్టుకుని దేహశుద్ధి చేసిన మహిళా సెక్యూరిటీ.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరిగిన తాజా ఘటనతో భక్తుల రక్షణ, భద్రత పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మహామండపం లో ఒక యువకుడు మహిళల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయాడు. 6వ అంతస్తులో ఉన్న మహిళల బాత్రూంలోకి నరేష్ (20) అనే యువకుడు రహస్యంగా చొరబడ్డాడు. అక్కడ మహిళలు స్నానం చేస్తున్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్ ద్వారా రికార్డు చేయడం ప్రారంభించాడు. లోపల ఉన్న మహిళలు గమనించి ఒక్కసారిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మహిళల అరుపులు విన్న వెంటనే అక్కడ విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాత్రూం నుండి బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన నరేష్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతానికి చెందిన నరేష్‌గా గుర్తించారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని డేటాను పరిశీలిస్తున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను కోరుతున్నారు.






