సంతకు వెళ్లి అదృశ్యమైన చిన్నారి.. పోలీసుల ముమ్మర గాలింపు !

by Batti.Sumithra |

మద్నూర్ మండల కేంద్రంలో ఆరేళ్ల బాలిక కనిపించకుండా పోయిన ఘటన సోమవారం కలకలం రేపింది.

సంతకు వెళ్లి అదృశ్యమైన చిన్నారి.. పోలీసుల ముమ్మర గాలింపు !
X

దిశ, మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో ఆరేళ్ల బాలిక కనిపించకుండా పోయిన ఘటన సోమవారం కలకలం రేపింది. మద్నూర్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన హన్మంత్ కూతురు దుర్గ సోమవారం మద్నూర్‌లో జరిగే సంతకు తండ్రితో కలిసి వచ్చింది. మిర్చి బండి వద్ద తినుబండారం తింటున్న సమయంలో అకస్మాత్తుగా బాలిక కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మద్నూర్ మండలం తడి హిప్పర్గా గ్రామానికి చెందిన వ్యక్తి బాలికను తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ పట్టణంలోనూ గాలించుతున్నారు. నిన్నటి నుంచి బాలిక జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story