సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మహిళ.. లాటరీ పేరుతో టోకరా

by Disha Web Desk 13 |
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మహిళ.. లాటరీ పేరుతో టోకరా
X

దిశ, లింగాల: ఆన్‌లైన్ మోసానికి నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం లో ఓ మహిళ మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై రవి కథనం ప్రకారం.. అంబటిపల్లి గ్రామానికి చెందిన ఆవుల జ్యోతి అనే మహిళ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 25న జ్యోతి అనే మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు వాట్సప్ కాల్ చేసి మీ నెంబర్ రూ.25,00,000 లాటరీ గెలుచుకున్నారు అని చెప్పినాడు. తర్వాత అట్టి డబ్బులు మీ అకౌంట్ కి రావాలి అంటే గవర్నమెంట్ చార్జీలు 8000 ఫోన్ నెంబర్ కు ఫోన్ పే చేయమని చెప్పగా ఫోన్ పే చేశామని తెలిపారు.


తర్వాత మళ్ళి అదే రోజు 11:30 గంటలకు వాట్సన్ కాల్ చేసి రూ 2000 లు కంప్యూటర్ ఆన్ కావడానికి అని చెప్పాడు. తర్వాత రూ. 10,500లు పంపితే మొత్తం డబ్బులు మీ అకౌంట్ వస్తాయని చెప్పారు. మళ్లీ ఫోన్ పే ద్వారా పంపించమని తెలిపారు. ఆ తర్వాత 6000 పంపితే మొత్తం డబ్బులు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ అకౌంట్ లోకి వస్తాయి అని చెప్పగా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పారు. తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఎంతకీ డబ్బు రాకపోయేసరికి మోసపోయానని గ్రహించి 155260 నెంబర్ కాల్ చేశాడు. మొత్తం 20,500 రూపాయలు మోసపోయానని గ్రహించి ఠాణాలో ఫిర్యాదు చేశారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.


Next Story

Most Viewed