జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. రెండేళ్ల బాబు స్పాట్‌డెడ్

by Disha Web Desk 2 |
జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. రెండేళ్ల బాబు స్పాట్‌డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రెండేళ్ల బాలుడ్ని ఎత్తుకొని రోడ్డు దాటుతున్న మహిళను అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిలో నుంచి రెండున్నరేళ్ల బాబు కిందపడిపోయాడు. తలకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరార్ అయ్యాడని స్థానికులు చెబుతున్నారు. కారుపై ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉండటం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ కారుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed