- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలకి పంపండి.. రూ.1000 పొందండి..!
ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడానికి గ్రామ సర్పంచులు, డాక్టర్స్, ఉపాధ్యాయులు, సమాజం పట్ల నిబద్ధత కలిగిన పలువురు ప్రముఖులు పలు రకాల ఆఫర్స్ ప్రకటిస్తున్నారు.

దిశ, బైంసా : ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడానికి గ్రామ సర్పంచులు, డాక్టర్స్, ఉపాధ్యాయులు, సమాజం పట్ల నిబద్ధత కలిగిన పలువురు ప్రముఖులు పలు రకాల ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బైంసా మండలం లింగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఇక్కడి ఉపాధ్యాయుడు బిజ్జుర్వార్ సాయినాథ్ రూ.1000 నజరానా ఆఫర్ ను ప్రకటించారు. పాఠశాలలో అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల రూ.1000 ఆఫర్ ని ప్రకటించారు.
ఈ డబ్బులను తన సొంత జీతం నుండి చెల్లిస్తానని ప్రకటించారు. సున్నా సంఖ్య గల ఈ పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా మూతపడి ఉంది. అధికారుల నిర్ణయం మేరకు ఈ సంవత్సరం పాఠశాల తెరవాలి అన్న నిబంధన రాగా, విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసమే ఇక్కడి ఉపాధ్యాయుడు సాయినాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అసలే విద్యార్థులు లేని ఈ పాఠశాలలో ఈ ఆఫర్ ప్రకటించిన నాటి నుండి ముగ్గురు విద్యార్థులు అడ్మిషన్లు అయ్యారంటూ తెలిపారు. అయితే ఇది విన్న ప్రజలు,విద్యార్థి దశలోనే విద్యార్థులకు వేతనమంటూ గుసగుసలాడుకుంటున్నారు.






