ప్రతి వైద్యాధికారి మరింత బాధ్యతతో పనిచేయాలి..

by Kodari Anjali |

సమపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని వైద్యాధికారుల హాజరుపై కలెక్టర్ వీసీ సీరియస్ అయ్యారు.

ప్రతి వైద్యాధికారి మరింత బాధ్యతతో పనిచేయాలి..
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: ఇటీవల జరిగిన మాతృ మరణ ఘటనల నేపథ్యంలో ప్రతి వైద్యాధికారి మరింత బాధ్యతతో పనిచేయాలని, గర్భిణీల పర్యవేక్షణ, అత్యవసర వైద్య సేవలు, రెఫరల్ వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధి నిర్వహణ, ప్రధాన కార్యాలయ హాజరు, సేవల అందజేతపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని వైద్యాధికారులు మరియు ఆరోగ్య సిబ్బంది విధిగా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, విధి సమయాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ కి ఆదేశించారు. సమయపాలన పాటించని వైద్యాధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అందరు కలెక్టర్ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, జిల్లాలో అన్ని ఆరోగ్య సంస్థల్లో హాజరు, సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ తో పాటు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు , పాల్గొన్నారు

Next Story