ఇల్లంత కుంటలో కార్పొరేట్ వైద్యం..!

by Batti.Sumithra |

మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఇల్లంత కుంటలో కార్పొరేట్ వైద్యం..!
X

దిశ, ఇల్లంతకుంట : మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరా పండుగ నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కాంట్రాక్టర్ మేడి రమేష్ తెలిపారు. ఆధునిక ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్, వెంటిలేటర్ సదుపాయం, అత్యవసర చికిత్స విభాగం, ప్రసూతి సేవలు, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రస్తుతం చికిత్స కోసం సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న మండల ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనులు చేపడుతున్నామని మేడి రమేష్ తెలిపారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మండల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం చేరువ కావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే వైద్య సేవలు స్థానికంగానే లభించనున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 50 పడకల ఆసుపత్రి త్వరలో వాస్తవ రూపం దాల్చనుండటంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story