- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు: కలెక్టర్ డా.ఏ.సిరి
ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు...

దిశ, కర్నూలు ప్రతినిధి: ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరిలో జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్‌లో పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, వ్యూ పాయింట్, బహిరంగ సభ, స్టాళ్ల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ కో ఆర్డినేట్స్, లైటింగ్ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించారు. మైనింగ్ వ్యూ పాయింట్, బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలిస్తూ, బహిరంగసభకు సుమారు 5 వేల నుంచి 10 వేల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, ప్రజలకు తాగునీరు, భోజన వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్, సీటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలపై ఎస్పీ, కలెక్టర్ చర్చించి పోలీస్ అధికారులకు సూచనలు ఇచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.






