- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శ్రీనివాస మంగాపురం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. మెస్మరైజింగ్‌గా మంగ ఫస్ట్ లుక్
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ(Jayakrishna) ఘట్టమనేని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ(Jayakrishna) ఘట్టమనేని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram)అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 'RX 100', 'మంగళవారం' వంటి సెన్సేషనల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కల్ట్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతుండగా.. లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇది ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. చందమామ కథలు వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన బ్యానర్‌పై ప్రఖ్యాత నిర్మాత అశ్వనీదత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా తడాని(Rasha Tadani) టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.
తాజాగా రాషా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పింక్ కలర్ చూడిదార్‌లో మందారం కొమ్మను పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్నమంగ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘లక్ష మంది దేవదూతలు నా పక్కనుండి వెళ్ళినా, నేను కేవలం నీ వైపే చూస్తూ ఉంటాను’’ అంటూ డైరెక్టర్ అజయ్ భూపతి షేర్ చేసిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో జయకృష్ణ ‘శ్రీను’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. షూటింగ్ ఇప్పటికే వేగంగా సాగుతుండగా, వరుస అప్డేట్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అటు ఘట్టమనేని అభిమానులు, ఇటు సామాన్య ప్రేక్షకులు ఈ కొత్త జంట వెండితెరపై ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






