- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాయితీ చాటుకున్న విద్యార్థి
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. రోడ్డుపై దొరికిన విలువైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్‌ను స్వాధీనం చేసుకోకుండా పోలీసులకు అప్పగించాడు. వివరాల్లోకి వెళితే.. చెల్పూర్ గ్రామానికి చెందిన జాఫర్ పాషా కుమారుడు **నవమన్ పాషా**, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారిపై అతనికి ఒక సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ లభించింది.
విలువైన వస్తువు దొరికినా తన వద్ద ఉంచుకోకుండా, నవమన్ పాషా నేరుగా హుజురాబాద్ సీఐ కర్ణాకర్‌ను కలిసి ట్యాబ్‌ను సురక్షితంగా అప్పగించాడు. బాలుడి నిజాయితీని సీఐ అభినందిస్తూ, ఇతర విద్యార్థులకు కూడా ఆదర్శంగా నిలిచాడని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఐ కర్ణాకర్ మాట్లాడుతూ.. సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్‌ను పోగొట్టుకున్న వారు తగిన ఆధారాలతో హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తమ వస్తువును స్వీకరించవచ్చని తెలిపారు.






