- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల భద్రతకు సర్కార్ సరికొత్త అస్త్రం: సైరన్, ఫ్లాష్‌లైట్‌తో ‘కీచైన్ అలారం’ రెడీ
మహిళల రక్షణ కోసం సైరన్, ఫ్లాష్‌లైట్‌తో కూడిన వినూత్న ‘కీచైన్ అలారం’ అందుబాటులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా యూపీ సర్కార్ ఓ వినూత్నమైన అడుగు వేసింది. యూపీలోని బాగ్‌పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మిత లాల్ (Asmita Lal) మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యవసర రక్షణ పరికరం ‘కీచైన్ అలారం’ (Keychain Alarm)ను అధికారికంగా ప్రారంభించారు. మహిళలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆపద నుంచి తక్షణమే రక్షించుకోవడానికి ఈ చిన్న గ్యాడ్జెట్ ఎంతగానో ఉపయోగపడనుంది.
ఈ ‘కీచైన్ అలారం’ ఎలా పని చేస్తుందంటే?
మహిళలు, యువతులు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఎవరైనా వెంబడిస్తున్నప్పుడు ఈ కీచైన్‌కు ఉన్న పిన్‌ను లాగాల్సి ఉంటుంది. పిన్ తీయగానే ఈ పరికరం నుంచి భారీ సైరన్ (Siren) శబ్దం వస్తుంది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే అలర్ట్ అయ్యి సహాయం చేయడానికి వీలవుతుంది. ఇక రాత్రి వేళల్లో, చీకటి ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇందులోని పవర్‌ఫుల్ ఫ్లాష్‌లైట్ శత్రువుల కళ్లపై పడేలా చేసి భయపెట్టవచ్చు. ఆ గ్యాప్‌లో మహిళలు అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకోవచ్చు.
సూపర్ పోర్టబుల్ డిజైన్..
కీ చైన్ చూడ్డానికి సింపుల్‌గానే ఉంటుంది. దాన్ని సులభంగా హ్యాండ్ బ్యాగులకు, మొబైల్ ఫోన్లు, కీలకు తగిలించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా తొలుత పాఠశాలలు, కళాశాల విద్యార్థినులతో పాటు ఉద్యోగినులకు ప్రాధాన్యత క్రమంలో ఈ భద్రతా పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మహిళా రక్షణలో ఇదొక కీలక అడుగు కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.






