‘ధురంధర్-2’ సినిమాలో స్టార్ హీరో ఎంట్రీ.. ఇక బాక్సాఫీసు షేక్ అవ్వడం ఖాయం!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-21 08:11:54  IST  )

భారీ హైప్ సొంతం చేసుకున్న బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘ధురంధర్ 2’(Dhurandhar-2) అనే చెప్పాలి.

‘ధురంధర్-2’ సినిమాలో స్టార్ హీరో ఎంట్రీ.. ఇక బాక్సాఫీసు షేక్ అవ్వడం ఖాయం!
X

దిశ, సినిమా: భారీ హైప్ సొంతం చేసుకున్న బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘ధురంధర్ 2’(Dhurandhar-2) అనే చెప్పాలి. దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar), బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చిలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ‘పార్ట్ 1’ దాదాపు 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్ట్ 1 హవా ఇంకా తగ్గకముందే, ఇప్పుడు పార్ట్ 2 గురించి వస్తున్న ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ గతంలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించిన ‘యురి’ (URI) చిత్రం ఏ రేంజ్‌లో సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

ఇప్పుడు అదే ‘యురి’ బ్యాక్ డ్రాప్‌ను ‘ధురంధర్ 2’తో లింక్ చేస్తున్నట్టు టాక్. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపిస్తాడని, అది కూడా ‘యురి’లో తను చేసిన ఆర్మీ ఆఫీసర్ పాత్రలోనే మళ్ళీ మెరుస్తాడని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య సాగే యాక్షన్ ఎపిసోడ్స్ నార్త్ ఇండియాలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాయని అంతా భావిస్తున్నారు. సాధారణంగా ఒక సక్సెస్‌ఫుల్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ‘యురి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ‘ధురంధర్-2’కు కనెక్షన్ పెడితే, బాక్సాఫీసు షేక్ అవ్వడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.

Read More..

40 ఏళ్ల నటుడితో రొమాన్స్ చేయడంపై సారా అర్జున్ షాకింగ్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చిపడేసిందిగా!

Next Story