భారీ సిక్సర్‌తో అభిమానికి గాయం.. ఐపీఎల్ మ్యాచ్‌లో రక్తం చిందిన వైనం!

by Malleboina Mahesh |   (  Updated:2026-04-29 14:14:41  IST  )

ఐపీఎల్ మ్యాచ్‌లో అపశ్రుతి! ప్రియాంశ్ ఆర్య సిక్సర్‌తో అభిమాని ముఖానికి తీవ్ర గాయం. రక్తం చిందిన దృశ్యాలు వైరల్.

భారీ సిక్సర్‌తో అభిమానికి గాయం.. ఐపీఎల్ మ్యాచ్‌లో రక్తం చిందిన వైనం!
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 11 బంతుల్లో 29 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో, అతను కొట్టిన ఒక భారీ సిక్సర్ నేరుగా స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న ఒక అభిమాని ముఖానికి బలంగా తగిలింది. బంతి తగిలిన వేగానికి ఆ వ్యక్తి ముఖం పై తీవ్ర గాయమై రక్తం చిందడంతో స్టేడియంలోని తోటి అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఘటన జరిగిన వెంటనే స్టేడియం వైద్య సిబ్బంది బాధితుడి వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More... డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సిగరేట్ తాగిన రియాన్ పరాగ్.. క్రిమినల్ కేసు..?

Next Story