గణతంత్ర వేడుకల్లో 'అష్టలక్ష్మి' కళాకారులకు పట్టం

by Malleboina Mahesh |

ప్రతి సంవత్సరం 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

గణతంత్ర వేడుకల్లో అష్టలక్ష్మి కళాకారులకు పట్టం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి సంవత్సరం 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగే 'ఎట్ హోమ్' (At Home) విందుకు అతిథులను ఆహ్వానించేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఈ ఆహ్వాన పత్రిక 'అష్టలక్ష్మి' రాష్ట్రాలుగా పిలువబడే ఈశాన్య భారత ప్రాంతానికి చెందిన నైపుణ్యం కలిగిన చేతివృత్తుల కళాకారులకు ఘన నివాళి గా నిలుస్తుంది. ఆ ప్రాంతం పురాతన విజ్ఞానం, వైవిధ్యభరితమైన సాంస్కృతిక సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుతున్న కళాకారులను గౌరవించేలా దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

ఈశాన్య భారత కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించేలా, తరతరాలుగా వస్తున్న వారి నైపుణ్యాలను ఈ ఆహ్వాన పత్రికలో అందంగా పొందుపరిచారు. ఆలోచనాత్మకమైన డిజైన్, సూక్ష్మమైన కళాత్మక అంశాలతో (intricate elements) రూపొందించిన ఈ పత్రిక.. ఆ ప్రాంతపు గొప్ప చరిత్రను, సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ ప్రత్యేక రూపకల్పన ద్వారా రాష్ట్రపతి భవన్ భారతీయ కళాకారుల ప్రతిభను, దేశ సాంస్కృతిక వైభవాన్ని మరోసారి చాటిచెప్పింది.

Next Story