మరో ఫ్లాప్‌ ఖాతాలో వేసుకున్న స్టార్ యాక్టర్

by Web Desk |
మరో ఫ్లాప్‌ ఖాతాలో వేసుకున్న స్టార్ యాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే సంచలనంగా మారిన హీరో కార్తికేయ. 2018లో ఆర్ఎక్స్ 100 మూవీతో కార్తికేయ తెలుగులో స్టార్ హోదాను అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత కార్తికేయ మళ్లీ హిట్ అందుకోలేక పోయాడు. ఆ తర్వాత కార్తికేయ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. 2019లో నేచురల్ స్టార్ నాని 'గ్యాంగ్‌లీడర్'తో విలన్‌గా అవతారమిచ్చాడు. అప్పటికీ హిట్ అందుకోలేక పోయాడు. ఇటీవల తమిళ స్టార్ అజిత్‌కు విలన్‌గా 'వలిమై'లో నటించాడు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ కూడా కార్తికేయ ఫ్లాస్ స్ట్రీక్‌కు ఫుల్ స్టాప్ పెట్టలేక పోయింది. భారీ అంచనాలతో 'వలిమై' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయినప్పటికీ ప్రేక్షకులను అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ మూవీలో కార్తికేయ నటనను అందరూ మెచ్చుకున్నా సినిమా మాత్రం అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ మూవీలో పాత్ర కోసం కార్తికేయ భారీ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసినా లాభం లేక పోయింది. ఇంత చేసినా ఈ సినిమా తమిళంలో పర్వాలేదు అనిపించుకుంది. మిగిలిన భాషల్లో మాత్రం ఫ్లాప్ టాక్ అందుకుంది. మరి కార్తికేయ ఫ్లాప్ స్ట్రీక్‌కు త్వరలో ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.



Next Story