చుట్టుముట్టిన వరుస వివాదాలు.. యూట్యూబర్ ‘అన్వేష్’ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 09:39:28  IST  )

ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (Naa Anveshana) ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ (Anvesh) తన ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లుగా తాజాగా ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా ఓ రీల్‌ను వదిలాడు.

చుట్టుముట్టిన వరుస వివాదాలు.. యూట్యూబర్ ‘అన్వేష్’ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (Naa Anveshana) ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ (Anvesh) తన ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లుగా తాజాగా ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా ఓ రీల్‌ను వదిలాడు. ఆ రీల్‌లో అన్వేష్ మాట్లాడుతూ.. సుమారు 130 దేశాలు చుట్టేసిన ఆయన, ఇకపై వ్యూస్ కోసం లేదా యూట్యూబ్ ఆదాయం కోసం దేశాలు తిరగబోనని స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు దాదాపు రూ.8 కోట్లు సంపాదించానని.. జీవితం మొత్తం బ్రతకడానికి ఆ మాత్రం డబ్బు చాలన్నాడు. ఇకపై తన సబ్‌స్క్రైబర్ల కోసం కాకుండా.. వ్యక్తిగత సంతోషం కోసం మిగిలిన దేశాలను సందర్శిస్తానని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ట్రావెలింగ్‌ను పక్కన పెట్టి, ఇకపై సామాజిక అంశాలపై దృష్టి సారిస్తానని అన్వేష్ వెల్లడించారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పుతానని, బాధితుల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారు.

కాగా, ఇటీవల ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు (Garikipati Narsimha Rao)పై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా ఆయన ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గడమే కాకుండా, హిందూ సంఘాల నుంచి ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story