తెలంగాణ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు

by Disha Web Desk 2 |
తెలంగాణ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసన సభలో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నోత్తరాల్లో తనకు బదులుగా ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు మాట్లాడతారని అనడం నవ్వులు పూయిచింది. అదే విధంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి టూరిజంపై జరిగిన చర్చలో కాశీ తర్వాత కందుకూరు టెంపుల్‌లో కల్పవృక్షాలు ఉన్నాయని పేర్కొనడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కల్ప వృక్షాలు ఉన్నాయి కాబట్టి నిధులు కేటాయించాల్సిన అవసరం లేదుకదా? అని అనడంతో సభలో సభ్యులంతా ఒక్కసారి నవ్వారు.

Next Story