- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేగంగా పెరగడంతో ఫారాల్లో కోళ్లు ఇలా మారుతున్నాయి.. స్టడీలో వెల్లడి
chicken may experience higher rates of mortality. గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచవ్యాప్తంగా కోడి మాంసం వాడకం విపరీతంగా ఉంది. నానాటికీ పెరుగుతున్న డిమాండ్ వల్ల కోళ్లు పుట్టి, పెరిగి, సరైన కండ సంతరించుకునే టైం కూడా లేకుండా పోయింది. దానితో అవి అతి తక్కువ సమయంలో కోయడానికి అనువుగా వాటికి మందులు, ఇంజక్షన్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం కోళ్ల ప్రాణాల మీదకు వస్తోంది. ఇటీవలి నివేదిక ప్రకారం, UKలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మాంసం కోళ్లు ప్రతి వారం వధకు సిద్ధంగా ఉండకముందే చనిపోతున్నట్లు తెలిసింది. జంతు సంరక్షణ సంస్థ ఓపెన్ కేజెస్ అధికారిక డేటా అధ్యయనం ప్రకారం, UKలో దాదాపు 64 మిలియన్ల కోళ్లు ప్రతి సంవత్సరం వధించబడకుండానే చనిపోతున్నాయి. ఈ చనిపోయిన కోళ్లను కాల్చేయాలి. లేదంటే ప్రోటీన్ మీల్స్ వంటి ఉత్పత్తుల్లో ప్రాసెస్ చేయవచ్చు. అయితే, కాలిస్తే ఉపయోగం ఉండదు గనుక, ప్రోటీన్ మీల్స్ ఉత్పత్తుల్లో ఈ మృత కోళ్లు చేరుతున్నాయి. అప్పటికే ఆ పదార్థాల్లో ఉన్న కెమికల్స్‌కు తోడు మందులకు తట్టుకోలేక చనిపోయిన కోళ్లు అందులో కలిస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక, జంతు హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం మెరుగైన సంక్షేమ ప్రమాణాలు ఈ కోళ్ల మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చని తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కోళ్ల జాతులను, అలాగే వాటి తక్కువ నిల్వ సాంద్రతను తొలగించడానికి, హక్కుల కార్యకర్తలు బెటర్ చికెన్ కమిట్‌మెంట్‌ను ఆమోదించాలని వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి, ఈ ఆధునిక కోడి చాలా వేగంగా పెరగడానికి జన్యుపరంగా అభివృద్ధి చేయబడిన జాతి. అయితే, త్వరగా కండ సమకూరడానికి వాడే మందుల వల్ల దాని శరీరం చాలా ఒత్తిడికి గురౌతుంది. తద్వారా కోడి గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని సంక్షేమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి పరిశోధన ప్రకారం, వేగంగా పెరుగుతున్న కోళ్లు కేవలం 35 రోజుల్లో వధకు సరిపోయే బరువును చేరుకుంటాయి. నెమ్మదిగా పెరిగే రకాల కంటే వీటిల్లో మరణాలు, కుంటితనం, కండరాల వ్యాధులు అధిక రేటులో ఉన్నట్లు డాటా చెబుతోంది. ఇలా గుండె ఆగిపోవడం, ఆకస్మిక డెత్ సిండ్రోమ్ అనేది కోళ్ల మందలో మరణాలకు చాలా తరచుగా కారణమవుతున్న వాటిలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 'బెటర్ చికెన్ కమిట్‌మెంట్'ను ఫ్రాన్స్‌లోని అన్ని ప్రధాన రిటైలర్లు ఆమోదించారు. అయినప్పటికీ, బ్రిటన్‌లోని అతిపెద్ద సూపర్ మార్కెట్‌లు ఇంకా దీన్ని ఆమోదించలేదు. ఇప్పటికి, మార్క్స్ & స్పెన్సర్, వెయిట్రోస్, ప్రెట్, KFC, భోజన సేవలను అందించే కంపాస్ గ్రూప్ నుండి ఇది మద్దతును పొందింది. మార్చి 2023 నాటికి, UK ప్రమాణం కంటే 20% ఎక్కువ స్థలంలో తాజా చికెన్‌ను పెంచుతామని సైన్స్‌బరీ ఏప్రిల్‌లో పేర్కొంది.






