- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ బడ్జెట్‌తో మోదీ బయోపిక్.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ‘మా వందే’(maa vande) టైటిల్ తో రాబోతుంది.

దిశ, సినిమా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ‘మా వందే’(maa vande) టైటిల్ తో రాబోతుంది. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) నటిస్తున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా ‘మా వందే’ సినిమాలో చూపించబోతున్నారు. ఓ మామూలు బయోపిక్ లా కాకుండా చలనచిత్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ‘మా వందే’ నిర్మాణవుతోంది.
ఈ స్టోరీ డ్రివెన్ మూవీని ప్రపంచంలో తొలిసారిగా తొలిసారి ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్ లో హీరోగా నటించిన జేసన్ మమొవాను ‘మా వందే’ చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి పేరున్న యాక్టర్స్ ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ నచ్చి మూవీ చేసేందుకు అంగీకరించారు. ప్రీ ప్రొడక్షన్ కే మూడేళ్ల సమయం తీసుకోవడం చూస్తే ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘మా వందే’ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 22వ తేదీ నుంచి కాశ్మీర్‌లో ప్రారంభం కా నుంది.






