మీ బాయ్‌ఫ్రెండ్‌పై డౌట్ ఉందా? ఆ టెస్ట్‌తో తేల్చుతున్న మోడల్!

by Dishafeatures2 |
మీ బాయ్‌ఫ్రెండ్‌పై డౌట్ ఉందా? ఆ టెస్ట్‌తో తేల్చుతున్న మోడల్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత యంగ్ జనరేషన్‌లో రిలేషన్‌షిప్స్ కామన్. కానీ అవి ఎంతకాలం కొనసాగుతున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్ట్‌నర్స్ మధ్య లోపించిన లాయల్టీ, మల్టిపుల్ రిలేషన్స్ వంటి కారణాలతో షార్ట్ పీరియడ్‌లోనే బ్రేకప్‌కు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ బాయ్‌ఫ్రెండ్స్ జెన్యూన్‌గా ఉన్నారో లేదో పరీక్షించేందుకు ఫిమేల్ పార్ట్‌నర్స్ నుంచి రూ.1.4 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఒక మోడల్ పేర్కొంది. ఒకవేళ బాయ్‌ఫ్రెండ్ చీటింగ్ చేయట్లేదని తేలితే డబ్బు వాపస్ చేస్తానని ఆఫర్ ఇచ్చింది.

గతంలో ప్లేబాయ్ ఆఫ్రికా కవర్ పేజీపై కనిపించిన కరోలినా లెక్కర్.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మోసగాళ్లను పట్టుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ క్రమంలో తమ బాయ్‌ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలనుకున్న వారి నుంచి రూ. 1.4 లక్షలు వసూలు చేస్తోంది. మరో విషయం ఏంటంటే.. సదరు మహిళలు తమ పార్ట్‌నర్స్ మొబైల్ నంబర్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మేల్ పార్ట్‌నర్స్ కరోలినాతో కలవడానికి అంగీకరించకుంటే వారి ఫిమేల్ పార్ట్‌నర్స్‌కు డబ్బు తిరిగిస్తుంది.

'ముందుగా నేనే పరీక్షించబోయే బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించి, రిప్లయ్ వచ్చేదాకా వెయిట్ చేస్తా. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ హాట్‌ఫుల్‌గా మారేంత వరకు కొనసాగిస్తాను. ఈ మాటల తర్వాత అతను నన్ను కలవాలనుకుంటే లాయల్టీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లే. కానీ నాకు మాత్రం డబ్బు వస్తుంది' అని కరోలినా చెప్పుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా రూ. 7.50 లక్షలు సంపాదించినట్లు తెలిపిన మోడ్.. ఆ మొత్తాన్ని కాస్మెటిక్ ప్రొసీజర్స్ కోసం ఖర్చు చేస్తానని చెప్తోంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పర్సనాలిటీగా మారాలనే లక్ష్యంతో ఉన్న ఆమె.. ప్లాస్టిక్ సర్జరీల కోసం ఇప్పటికే కోటి రూపాయలు ఖర్చు చేయడం విశేషం.



Next Story

Most Viewed