- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ముధోల్: తాగిన మైకంలో స్మశాన వాటికలోని చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బైంసా మండలంలోని దెగాం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి (36) గత కొంతకాలంగా మద్యానికి బానిసగా మారాడు. పని చేయకుండా రోజూ మద్యం తాగుతూ కాలం గడుపుతుండేవాడు. ఇదే క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి మద్యం తాగిన మైకంలో ఇంటి నుంచి శేఖర్ రెడ్డి బయటకు వెళ్ళిపోయాడు. అనంతరం గ్రామ శ్మశాన వాటికకు వెళ్లి అక్కడ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . మృతునికి భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు.
Next Story






