46 ఏళ్ల వ్యక్తి హత్య.. అసలు కారణం తెలిసి షాకైన పోలీసులు

by Disha Web |
46 ఏళ్ల వ్యక్తి హత్య.. అసలు కారణం తెలిసి షాకైన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి హత్య చేసిన కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీరా అతడిని అసలు హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగిన పోలీసులకు అతడి సమాధానం వినగానే షాక్ తగిలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైనేజీ లైన్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త మరింత అధికమై గొడవగా మారింది. ఈ గొడవలో భాగంగానే 46 ఏళ్ల వ్యక్తిని మరోవ్యక్తి హత్య చేశాడు. ఘటన జరిగినట్లు తమకు సమాచారం వచ్చిన రెండు గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు 32 ఏళ్ల వీరేంద్ర అహిర్వార్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే బాధితుడు తన నివాసంలో హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరి మధ్య ఇదివరకే ఏమైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed