- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాన్నకు ఓ హాగ్ : కేటీఆర్ పిలుపు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతకు కీలక పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతకు కీలక పిలుపునిచ్చారు. యువత వీలైనంత సమయం తల్లిదండ్రులతో గడపాలని సూచించారు. యూత్ నడుపుతున్న స్ట్రీట్ కాజ్ అనే ఎన్జీవోకు సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. జీవితంలో తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వారిని మనం ఆప్యాయంగా హత్తుకుంటే వారి కళ్ళలో సంతృప్తితో కూడిన ఆనందం కనిపిస్తుందని తెలిపారు. జీవితం అనేది చాలా త్వరగా గడిచిపోతుందని, 60 ఏళ్ళు వచ్చాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఉరుకుల పరుగుల లైఫ్ తప్ప మనకంటూ మధుర జ్ఞాపకాలు ఏవీ ఉండవని అన్నారు.
తనకు కూడా కొడుకూ, కూతురు ఉన్నారని.. వాళ్లకు తగినంత సమయం ఇవ్వడం లేదేమో అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందని తెలియజేసారు. 40 ఏళ్ల వయసు వచ్చే వరకు తాను కూడా నాన్నకు హగ్ ఇవ్వలేదని, 2015 GHMC ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన్ను హగ్ చేసుకున్నానని కేటీఆర్ ముచ్చటించారు.






