- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rukmini Vasanth: కుర్రాళ్ల హాట్ బ్రేక్ .. రిలేషన్‌షిప్‌లో రుక్మిణి వసంత్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్!
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రుక్మిణి వసంత్(Rukmini Vasanth) అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది.

దిశ, సినిమా: కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రుక్మిణి వసంత్(Rukmini Vasanth) అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, రిషబ్ శెట్టితో కలిసి నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1)ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా సెన్సేషన్‌గా మారడంతో రుక్మిణి క్రేజ్ పెరిగింది.
నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రుక్మిణి ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు కూడా భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు.ఇలాంటి సమయంలో రుక్మిణి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
తాజాగా బయటకు వచ్చిన ఓ ఫోటోలో ఆమె సిద్ధాంత్ నాగ్ అనే వ్యక్తిని హగ్ చేసుకున్నట్లు కనిపించడంతో రిలేషన్‌షిప్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ ఒక్క ఫోటోతోనే నెటిజన్లు రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ఇది సన్నిహిత స్నేహానికి సంబంధించిన క్షణం మాత్రమేనని అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం వీరిద్దరి మధ్య ప్రేమ బంధం ఉందని అంటున్నారు. రుక్మిణి కమిటెడ్ అని తెలుగుసుకున్న కుర్రాళ్లు ఈ వార్తతో షాక్‌కు గురై సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ ఎమోజీలతో స్పందిస్తున్నారు. సిద్ధాంత్ నాగ్ ఎవరు? రుక్మిణి జీవితంలో ఆయన పాత్ర ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Read More.. రెడ్ డ్రెస్సులో హాట్ మిర్చిలా హీటెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్






