భవనంపై నుండి దూకి యువకుడి ఆత్మహత్య

by Javid Pasha |   (  Updated:2022-03-18 14:57:00  IST  )

దిశ ప్రతినిధి, హైదరాబాద్: భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్.. Latest Telugu News..

భవనంపై నుండి దూకి యువకుడి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. కోటి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల భవనంలో చాదర్ ఘాట్‌కు చెందిన మహమూద్ అలీ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతను భవనం వద్ద ఉన్న సమయంలో వారిస్తున్నా వినకుండా ఓ గుర్తు తెలియని 30 ఏళ్ల యువకుడు భవనంలోకి ప్రవేశించి ఐదవ అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహమూద్ అలీ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ప్రకాశం జిల్లాకు చెందిన డానియల్ (౩౦) గా గుర్తించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, మృతునికి మతిస్థిమితం సక్రమంగా లేకపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story