మేడారం జాతరలో మహా ఘట్టం.. భారీ భద్రత నడుమ సమ్మక్క ఆగమనం

by Gantepaka Srikanth |

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది.

మేడారం జాతరలో మహా ఘట్టం.. భారీ భద్రత నడుమ సమ్మక్క ఆగమనం
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం(Sammakka Saralamma Jatara 2026) సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమ్మక్క ఆగమన ప్రక్రియ మొదలైంది. గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకి ఎస్పీ స్వాగతం పలికారు. మూడంచెల భద్రత నడుమ సమ్మక్క రాబోతోంది. సరిగ్గా గురువారం రాత్రి 8:30 గంటలకు గద్దెపైకి చేరుకోనున్నారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనై దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలకడానికి భక్తులు సిద్ధమయ్యారు. గద్దెల ప్రాంతానికి చేరుకున్న అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సారయ్య ఈ మహా ఘట్టాన్ని పూర్తి చేయనున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్‌ సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే మహా జాతరలో తొలి కీలక ఘట్టం విజయవంతంగా పూర్తికాగా, సమ్మక్క ఆగమనం కోసం భక్తజనం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

Next Story