భార్య పై అనుమానం.. కన్న కొడుకును కిరాతకంగా చంపిన తండ్రి

by Batti.Sumithra |

నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.

భార్య పై అనుమానం.. కన్న కొడుకును కిరాతకంగా చంపిన తండ్రి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య పై అనుమానంతో మూడు నెలల కొడుకును కన్న తండ్రే పదునైన కత్తితో అతి కిరాతకంగా నరికి చంపిన దారుణ ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఈ కేసును వన్ టౌన్ పోలీసులు చేధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. కేసు వివరాలను వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి వెల్లడించిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆశోక్ నగర్ లో నివాసముంటున్న బద్రె ప్రియాంక, యువరాజు దంపతులకు మూడు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు.

ఈనెల 18న తన మూడు నెలల బాబును తన భర్త యువరాజు తీసుకుని బయటకు వెళ్లాడని, ఆపై కనిపించడం లేదంటూ భార్య ప్రియాంక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం పోలీసులు యువరాజును గుర్తించి పట్టుకున్నారు. మూడు నెలల బిడ్డ గురించి పోలీసులు యువరాజును విచారించగా, బాబు తనకు పుట్టిన బిడ్డ కాదని, తన భార్య పై ఉన్న అనుమానంతో బాబును తీసుకెళ్లి నిజామాబాద్ రైల్వే ట్రాక్ సమీపంలో పదునైన ఆయుధంతో హత్యచేసి, మృతదేహాన్ని అక్కడే పొదల్లో దాచి ఉంచినట్లు పోలీసుల విచారణలో యువరాజు అంగీకరించాడు. నిందితుడు యువరాజు చూపించిన ప్రదేశంలో పసిబిడ్డ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు. నిందితుడిని అరెస్ట్ చేసి తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Next Story