- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై ఆదివారం అర్ధరాత్రి..latest telugu news

X
దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నిర్మల్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న ఎర్టిగా కారు అతివేగంతో ఆర్మూరు శివారులోని చేపూర్ చౌరస్తాలో మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో రాము (32), జ్ఞానేశ్వర్ గౌడ్ (30)లు మృతి చెందారు. చరణ్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ చరణ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు కూడా ఆర్మూర్ మండలం మిర్ధపల్లి చెందినవారు. రాముకు నిర్మల్ జిల్లాలో రావలసిన డబ్బుల కొరకు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించి అజాగ్రత్తగా కారు నడపడం తోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






