నడిరోడ్డుపై అగ్నికి ఆహుతైన కారు.. ప్రాణాలు కాపాడుకున్న యువకులు

by Vinod kumar |

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రోడ్డుపై వెళ్తున్న కారు అగ్నికి ఆహుతైంది. సకాలంలో - A car going on the road caught fire

నడిరోడ్డుపై అగ్నికి ఆహుతైన కారు.. ప్రాణాలు కాపాడుకున్న యువకులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రోడ్డుపై వెళ్తున్న కారు అగ్నికి ఆహుతైంది. సకాలంలో మంటలను గుర్తించి కారును రోడ్డు పక్కకు నిలిపి అందులో ఉన్న ఇద్దరు యువకులు కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. జోగిపేటకు చెందిన మహ్మద్ ఒమర్, మహ్మద్ అజీజ్ అన్నదమ్ములు. కాగా వీరు షాపింగ్ కోసం నగరానికి హోండా సిటీ కారు (నెంబర్ MH-01-AE-6390)లో వచ్చారు.


సోమవారం మధ్యాహ్నం సమయంలో అబిడ్స్ నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తుండగా ఇంజన్ లో ఒక్కసారిగా పొగ, మంటలు వచ్చాయి. కారు నడుపుతున్న ఒమర్ దీనిని గమనించి కారును పక్కకు నిలిపి వెంటనే కిందకు దిగారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు గౌలిగూడ నుండి ఫైరింజన్ ను రప్పించి మంటలను అదుపు చేశారు.



Next Story